Andhra Pradesh: మంత్రి బొత్స కాళ్లు మొక్కిన ఐఏఎస్ ఆఫీసర్.. వీడియో వైరల్
![IAS Officer Touches Minister Botsa Feet](https://imgd.ap7am.com/thumbnail/cr-20220102tn61d14aea0b892.jpg)
- మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
- వంగి పాదాలకు నమస్కరించిన విజయనగరం జాయింట్ కలెక్టర్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఓ ఐఏఎస్ ఆఫీసర్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లను మొక్కడం వివాదాస్పదమైంది. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ బొత్సకు వంగి పాదాలకు నమస్కారం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి అయిన బొత్సకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే క్రమంలో కిశోర్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కాళ్లకు మొక్కారు.
అయితే, జేసీ దఫేదారు సంప్రదాయబద్ధంగా నమస్కారం చెప్పగా.. ఓ అత్యున్నత అధికారి అయి ఉండి జేసీ కాళ్లు మొక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.