Nani: 'అంటే .. సుందరానికీ!' కాస్త ఛాదస్తం ఎక్కువే!

Ante Sundaraniki Movie Zeroth Look

  • సుందరం పాత్రలో నాని
  • పల్లెకి .. ఫారిన్ కి మధ్య జరిగే కథ
  • కథానాయికగా నజ్రియా పరిచయం
  • వేసవిలో ప్రేక్షకుల ముందుకు  

నాని హీరోగా 'అంటే .. సుందరానికీ!' సినిమా రూపొందుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి నజ్రియా కథానాయికగా పరిచయం కానుంది. ఆ మధ్య ఆమె ఈ సినిమా షూటింగుకి హాజరై .. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెంటనే కేరళ వెళ్లిపోయింది.

ఆ సమయంలో నాని పూర్తి దృష్టిని 'శ్యామ్ సింగ రాయ్' పైనే పెట్టాడు. అలా షూటింగు పరంగా కాస్త వెనుకబడిన 'అంటే .. సుందరానికి ప్రాజెక్టులో మళ్లీ కదలిక మొదలైపోయింది. కెరియర్ పరంగా నానీకి ఇది 28వ సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి జీరోత్ లుక్ ను వదిలారు. అలాగే నాని వాయిస్ పై ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు.

నాని వేషధారణ .. ఆయన మాటలు వింటుంటే మాత్రం, విదేశాలకి వెళ్లినా మన సంప్రదాయాలను .. ఆచారాలను పొల్లుపోకుండా పాటించే రకంలా కనిపిస్తున్నాడు. పైగా రాసులు .. నక్షత్రాలపై నమ్మకం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ధోరణికి తగినట్టుగానే ఈ సినిమాను ఆవకాయ సీజన్లో రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పడం విశేషం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News