Chandrababu: వంగవీటి రాధా నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Supremo Chandrababu visits Vangaveeti Radha

  • తన హత్యకు రెక్కీ జరిగిందన్న వంగవీటి రాధా
  • రాధా వ్యాఖ్యలతో రాజకీయ సంచలనం
  • రాధాతో స్వయంగా మాట్లాడిన చంద్రబాబు
  • భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని సూచన

తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందంటూ బెజవాడ టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు. రాధాతో మాట్లాడి రెక్కీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు సూచించారు. రాధాకు టీడీపీ పూర్తి అండగా ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని పేర్కొన్నారు. రాధా హత్యకు రెక్కీపై చంద్రబాబు ఇటీవలే డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు.

కాగా, రాధాపై రెక్కీ అంశాన్ని మంత్రి కొడాలి నాని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడం తెలిసిందే. వెంటనే స్పందించిన సీఎం జగన్ 2 ప్లస్ 2 భద్రత కల్పించేందుకు ఆదేశాలు ఇచ్చినా, తాను నిత్యం ప్రజల్లో ఉండేవాడ్నని, తనకు ఎలాంటి భద్రత వద్దని రాధా తిరస్కరించారు.

Chandrababu
Vangaveeti Radha
Recce
Vijayawada
TDP
  • Loading...

More Telugu News