Kishan Reddy: హీరో సాయి తేజ్ నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union minister Kishan Reddy visits hero Sai Tej

  • ఇటీవల సాయి తేజ్ కు రోడ్డు ప్రమాదం
  • కోలుకున్న సాయి తేజ్
  • పరామర్శించిన కిషన్ రెడ్డి
  • కృతజ్ఞతలు తెలిపిన సాయి తేజ్

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి టాలీవుడ్ మెగా హీరో సాయి తేజ్ ను పరామర్శించారు. హైదరాబాదులోని సాయి తేజ్ నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి... సాయి తేజ్ తో ముచ్చటించారు. ఇటీవలే సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి... సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కెరీర్ లో మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలంటూ ఆశీస్సులు అందించారు.

కాగా, తన నివాసానికి కిషన్ రెడ్డి రాకపై సాయి తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. "ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మా ఇంటికి వచ్చి ఆప్యాయంగా పరామర్శించారు. ఎంతో సహృదయతతో మాట్లాడారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కిషన్ రెడ్డి గారూ, మీకు ఈ ఏడాది అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను" అంటూ సాయితేజ్ ట్వీట్ చేశారు.

Kishan Reddy
Sai Tej
Sai Dharam Tej
Home
Hyderabad
BJP
Tollywood
  • Loading...

More Telugu News