Mayawati: ఖజానాలోని డబ్బు వారిని వెచ్చగా ఉంచుతోంది: అమిత్ షాకు మాయావతి కౌంటర్

Mayawati counter to Amit Shah

  • యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు
  • మాయావతి చలి వల్ల బయటకు రావడం లేదన్న అమిత్ షా
  • బెహన్ జీ బయటకు రావాలని ఎద్దేవా

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ఇటీవల మొరాదాబాద్ లోని అలీగఢ్ నుంచి ఉన్నావో వరకు జన విశ్వాస్ యాత్రను చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మాయావతి ప్రచారానికి కూడా రావడం లేదని, చలి వల్ల బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు. బెహన్ జీ బయటకు రావాలని అన్నారు.

 ఈ వ్యాఖ్యలకు మాయావతి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఖజానాలోని డబ్బు వారిని చల్లటి వాతావరణంలో కూడా వెచ్చగా ఉంచుతోందని సెటైర్ వేశారు. పేదల కోసం ఉద్దేశించిన డబ్బు వారిని వెచ్చగా ఉంచుతోందని విమర్శించారు. అధికారంలో లేనప్పుడు వారు కూడా మనలాగే ఉన్నారని అన్నారు. తమ పార్టీ ప్రచారశైలి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. బీజేపీని యూపీ ప్రజలు మరోసారి నమ్మే పరిస్థితి లేదని మాయావతి అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News