KTR: ఏ నగరం కూడా హైదరాబాదుతో పోటీ పడలేదు: కేటీఆర్

Hyderabad is developing very fast says KTR

  • హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది
  • నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి సహకరించాలి
  • కంటోన్మెంట్ లో మూసేసిన రోడ్లను తెరిపించాలి

హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే దేశంలోని ఏ నగరం కూడా హైదరాబాదుతో పోటీపడలేదని వ్యాఖ్యానించారు. షేక్ పేటలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి సహకరించాలని కోరారు. నగరంలో గోల్కొండ, చార్మినార్ సహా ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, హైదరాబాదును హెరిటేజ్ సిటీగా గుర్తించేలా కృషి చేయాలని అన్నారు.

కంటోన్మెంట్ ఏరియాలో 21 రోడ్లను మూసేశారని వాటిని తెరిపించాలని కోరారు. స్కైవేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని అన్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి కొంపల్లి వరకు స్కైవేలు నిర్మించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని... అయితే భూములు ఇవ్వాలని రక్షణశాఖను కోరినా స్పందించడం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News