RRR: 'విడుదల అయ్యేలోపు నేను ముసలోడిని అయిపోతా'.. 'ఆర్ఆర్ఆర్' వాయిదాపై ఫన్నీ మీమ్స్
![rrr memes go viral](https://imgd.ap7am.com/thumbnail/cr-20220101tn61d006ba6c292.jpg)
- ఆర్ఆర్ఆర్ జులైకి వాయిదా పడనుందని సినీ వర్గాల టాక్
- అప్పుడు కూడా మరోసారి వాయిదా పడుతుందని మీమ్స్
- రాజమౌళితో పెట్టుకుంటే ఇంతేనని చురకలు
రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఈ ఏడాది జులైకి వాయిదా వేయాలని ఆర్ఆర్ఆర్ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారని, ఈ రోజు మధ్యాహ్నమే ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయనున్నారని పలువురు సినీ విశ్లేషకులు కూడా ట్వీట్టర్‌లో పేర్కొంటున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220101fr61d004593fa72.jpg)
ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని ఆశగా ఎదురుచూసిన సినీ ప్రేక్షకులు తీవ్ర నిరాశలో ఉన్నారు. జులైలో ఇంకో కరోనా వేరియంట్ వస్తే అప్పుడు కూడా మళ్లీ పోస్ట్ పోన్ చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యేలోపు నేను ముసలోడిని అయిపోతానేమో' అంటూ ఒకరు పోస్ట్ చేశారు.
ఆర్ఆర్ఆర్ విడుదల అయ్యేలోపు చిరంజీవి 200వ సినిమా కూడా విడుదల అవుతుందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. రాజమౌళితో పెట్టుకుంటే ఇంతేనని చురకలు అంటిస్తున్నారు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నామని, వెంటనే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలపై ఆ సినీ యూనిట్ అధికారిక ప్రకటన చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220101fr61d0055a9205e.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220101fr61d005d4aedc2.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220101fr61d005fb9e773.jpg)