Raghu Rama Krishna Raju: వారు చేస్తోన్న‌ వ్యాఖ్యలను పట్టించుకోను: ర‌ఘురామ‌కృష్ణరాజు

raghurama slams ycp govt

  • రేపో, మాపో జైలుకు వెళ్లే వారు వ్యాఖ్య‌లు చేస్తున్నారు
  • ఈ చార్జ్‌షీట్‌ ఇప్పుడే నమోదు కావడం కూడా చాలా శుభపరిణామం
  • అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తాం

రుణాల ఎగవేత కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సహా 16 మందిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. రఘురామకృష్ణరాజు చైర్మన్‌గా ఉన్న ఇండ్ భారత్ కంపెనీ రూ. 974.71 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించ‌లేద‌ని అభియోగాలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజుపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖ‌లు చేయ‌డంతో ఆయ‌న‌పై ప‌లువురు విమ‌ర్శ‌లు చేశారు.

దీనిపై ర‌ఘురామ‌కృష్ణ‌రాజు స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. రేపో, మాపో జైలుకు వెళ్లే వారు చేస్తోన్న‌ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. అయినా ఈ చార్జ్‌షీట్‌ ఇప్పుడే నమోదు కావడం కూడా చాలా శుభపరిణామమని ఆయ‌న పేర్కొన్నారు. తాము అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తామని రఘురామకృష్ణరాజు చెప్పారు.

Raghu Rama Krishna Raju
YSRCP
Andhra Pradesh
CBI
  • Loading...

More Telugu News