Chandrababu: కొత్త ఏడాది అందరూ ఆనందోత్సాహాలతో గడపాలి: చంద్రబాబు

Chandrababu conveys new year wishes

  • నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్ష
  • యువత కలలు నెరవేరాలన్న టీడీపీ అధినేత
  • కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్, బాలకృష్ణ

ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాది అందరూ ఆనందోత్సాహాలతో గడపాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సంతోషం, చిరునవ్వులు వెల్లివిరియాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ రంగాల్లో ఉన్నతస్థానం చేరుకోవాలని అభిలషించారు. కొత్త ఏడాదిలో యువతరం లక్ష్యాలు, కలలు నెరవేరాలని తెలిపారు.

అటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ... 2021 మనకు కరోనా కష్టాలు, వరద కన్నీరు మిగిల్చిందని వెల్లడించారు. 2022లో యువత తాము నిర్దేశించుకున్న రంగాల్లో గొప్ప స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

టాలీవుడ్ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో తెలుగు వాళ్లందరికీ అఖండ విజయం చేకూరాలని తెలిపారు. రైతులు, కార్మికులు, మహిళల జీవితాల్లో ఆనందం నిండాలని పేర్కొన్నారు. అందరికీ ఆయురారోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షిస్తున్నట్టు వివరించారు.

Chandrababu
New Year
2022
Wishes
Nara Lokesh
Balakrishna
Andhra Pradesh
  • Loading...

More Telugu News