Jr NTR: బైక్ సీన్ పై రాజమౌళి మాటలతో క్లారిటీ వచ్చింది: ఎన్టీఆర్

NTR explains bike scene in RRR

  • ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చిత్రం
  • జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' రిలీజ్
  • ఇటీవలే ట్రైలర్ రిలీజ్
  • బైక్ ను అలవోకగా ఎత్తిన ఎన్టీఆర్
  • సోషల్ మీడియాలో ట్రోలింగ్

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ విడుదల కాగా, అందులో ఓ బైక్ ను ఎన్టీఆర్ పైకెత్తే సీన్ అందరినీ విస్మయానికి గురిచేసింది. బైక్ ను పైకెత్తడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై ఓ ప్రమోషన్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పందించాడు. బైక్ ను మనిషి పైకెత్తడం గురించి సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో తనకు కూడా సందేహం వచ్చిందని వెల్లడించాడు.

ఇదే విషయాన్ని తాను దర్శకుడు రాజమౌళి వద్ద ప్రస్తావించగా... తీవ్ర ఆవేశంలో మనిషి ఏదైనా చేయగలడని, సాధ్యం కాని పనులు కూడా ఆ సమయంలో చేసేస్తాడని జక్కన్న వివరణ ఇచ్చాడని ఎన్టీఆర్ తెలిపాడు. ఈ సీన్ వెనుక అంతటి ఆవేశం ఉంది కాబట్టే తాను కూడా సంతృప్తి చెందానని పేర్కొన్నాడు. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యాక సినిమా చూస్తే ఈ సన్నివేశంలో బైక్ ఎత్తడం వెనుక కారణమేంటో ప్రేక్షకులకు అర్థం అవుతుందని స్పష్టం చేశౄడు.

Jr NTR
Bike
Scene
RRR
Rajamouli
Trailer
Tollywood
  • Loading...

More Telugu News