Samoa: అందరికంటే ముందు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించిన 'సమోవా'

Samoa enters into new year

  • 2022కు స్వాగతం పలికిన పసిఫిక్ ద్వీపదేశాలు
  • సమోవా, టోంగా, కిరిబాటి, న్యూజిలాండ్ లో ఘనంగా వేడుకలు
  • జిగేల్మన్న ఆక్లాండ్ స్కై టవర్
  • భారత్ లో మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరాది

భారత్ లో మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర ఘడియలు రానుండగా, 2022 ఏడాదికి పసిఫిక్ ద్వీప దేశాలు ప్రపంచంలో అందరికంటే ముందు స్వాగతం పలికాయి. పసిఫిక్ మహాసముద్రంలోని సమోవా దీవి ప్రపంచంలో అందరికంటే ముందు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించింది. టోంగా, కిరిబాటి దీవులతో పాటు న్యూజిలాండ్ కూడా 2022కు ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ లోని పలు నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి. రంగురంగుల బాణసంచా వెలుగులతో ఆకాశం మెరిసిపోయింది. ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు.

Samoa
New Year
2022
Tonga
Kiribati
New Zealand
Auckland
Sky Tower
  • Error fetching data: Network response was not ok

More Telugu News