RRR: ముంబయిలో ఆర్ఆర్ఆర్ బృందం కొత్త సంవత్సర వేడుకలు... ప్రోమో ఇదిగో!

RRR team celebrates new year in Mumbai

  • విడుదలకు సిద్ధమైన ఆర్ఆర్ఆర్
  • జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
  • ప్రమోషన్ ఈవెంట్లతో చిత్రయూనిట్ బిజీ
  • ఆర్ఆర్ఆర్ టీమ్ కొత్త సంవత్సర వేడుకలు జీటీవీలో ప్రసారం

భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మక రీతిలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై నిర్మితమైన ఆర్ఆర్ఆర్ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ ఈవెంట్లతో దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ముంబయిలో హిందీ వెర్షన్ కు, చెన్నైలో తమిళ వెర్షన్ కు, తిరువనంతపురంలో మలయాళ వెర్షన్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించారు.

ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ ముంబయిలో కొత్త సంవత్సర వేడుకల కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ఫిలింమేకర్ కరణ్ జొహార్ కూడా పాల్గొన్నారు. 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఇన్ ముంబయి' పేరిట ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ జీటీవీలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

  • Loading...

More Telugu News