Kala Venkata Rao: వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించిన వారిని ఇంత వరకు ఎందుకు పట్టుకోలేదు?: కళా వెంకట్రావు

Kala Venkatrao fires on YSRCP

  • రాధా హత్యకు రెక్కీ నిర్వహించడం బాధాకరం
  • రెక్కీ నిర్వహించింది వైసీపీ నేతలే
  • వారిపై చర్యలు తీసుకోకుండా కథలు చెపుతున్నారు

తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం ఇద్దరు గన్ మెన్లను పంపినప్పటికీ... గన్ మెన్లను ఆయన తిరస్కరించారు.

మరోవైపు ఈ అంశంపై టీడీపీ నేత కళా వెంకట్రావు మాట్లాడుతూ... వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రెక్కీ నిర్వహించిన వారిని ఇంత వరకు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.
 
వంగవీటి రంగాను హత్య చేయడం మంచిదే అన్న నేతలకు కార్పొరేషన్ పదవులను ఇచ్చారని కళా వెంకట్రావు మండిపడ్డారు. రాధాను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించింది వైసీపీ నేతలేనని.. వారిపై చర్యలు తీసుకోకుండా కథలు చెపుతున్నారని విమర్శించారు. రాధా టీడీపీలో ఉన్నారనే కోపంతోనే రెక్కీ నిర్వహించారని అన్నారు. వంగవీటి రాధా చాలా సహనం ఉన్న నాయకుడని ప్రశంసించారు. అమరావతి రైతులకు రాధా మద్దతు తెలిపారని అన్నారు.

Kala Venkata Rao
Vangaveeti Radha
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News