Sourav Ganguly: గంగూలీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

Sourav Ganguly remains hemodynamically stable
  • ఇటీవల కరోనా బారిన పడిన గంగూలీ
  • కోల్ కతా లోని ఉడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో చికిత్స
  • ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైడ్యులు తెలిపారు. ఆయన చికిత్స పొందుతున్న గదిలోని గాలిలో ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయిని 99 శాతం వద్ద కొనసాగిస్తున్నామని చెప్పారు. గత రాత్రి ఆయన బాగా నిద్రపోయారని తెలిపారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేశారని తెలిపారు. గంగూలీ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ సరోజ్ మోండల్, డాక్టర్ సప్తర్షి బసుల వైద్య బృందం పర్యవేక్షిస్తోందని బులెటిన్ లో వైద్యులు పేర్కొన్నారు.
Sourav Ganguly
Corona Virus
Health Bulletin
BCCI

More Telugu News