Vangaveeti Radha: వంగవీటి రాధా ఆఫీస్ ముందు స్కూటీ కలకలం!
- రాధా ఆఫీసు ముందు కొన్ని రోజులుగా ఉన్న స్కూటీ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన రాధా అనుచరులు
- స్కూటీ నాని అనే వ్యక్తిదని గుర్తించిన పోలీసులు
తనను చంపడానికి రెక్కీ నిర్వహించారంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా రాధా ఆఫీస్ ముందు మరో కలకలం రేగింది. ఆయన ఆఫీస్ ముందు కొన్ని రోజులుగా ఓ స్కూటీ పార్క్ చేసి ఉంది. దీనిపై పోలీసులకు రాధా అనుచరులు ఫిర్యాదు చేశారు.
దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు స్కూటీని స్వాధీనం చేసుకుని, దానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఆ స్కూటీ నాని అనే వ్యక్తికి చెందినదని గుర్తించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రాధా కార్యాలయం పక్కన వుండే స్వీట్ షాపులో పని చేసే వ్యక్తి స్నేహితుడిగా నానిని గుర్తించారు. వాహనానికి సంబంధించిన పత్రాలను చూపించి తీసుకెళ్లాలని చెప్పారు.