Shamirpet: హైదరాబాద్ శివారులో దారుణం.. విద్యార్థినిపై హెడ్మాస్టర్ అత్యాచారం

Head Master raped 9th class girl in Hyderabad

  • మాస్కు పెట్టుకోలేదని బాలికను తన గదికి పిలిచిన ఉపాధ్యాయుడు
  • ఈ విషయం బయట చెప్పొద్దని హెచ్చరిక
  • హెడ్మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు

హైదరాబాద్ శివారులోని శామిర్‌పేటలో ఓ స్కూలు ప్రధానోపాధ్యాయుడు దారుణానికి తెగబడ్డాడు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు...

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామిర్‌పేటకు చెందిన ఓ విద్యార్థిని (15) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 22న స్కూలుకు వెళ్లిన బాలిక మాస్కు ధరించకపోవడం చూసి తన గదికి రావాలని ప్రధానోపాధ్యాయుడు ఆదేశించాడు. గదిలోకి వచ్చిన బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను హెచ్చరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది.

గతంలో అదే పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు ఒకరు బుధవారం అక్కడికి వచ్చిన సందర్భంగా ఆమెను బాలిక కలిసింది. ఈ సందర్భంగా మాటల మధ్యలో తనపై జరిగిన దారుణాన్ని బాలిక ఆమెతో చెప్పి విలపించింది. ఆమె తానున్నానంటూ ధైర్యం చెప్పడంతో తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెడ్మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Shamirpet
Hyderabad
Girl Student
Rape
  • Loading...

More Telugu News