Samantha: "ఊ అంటావా మావా ఊఊ అంటావా"... చిన్నారి పాటకు సమంత ఫిదా

Samantha shared a video child singing Pushpa item song

  • పుష్ప చిత్రంలో సమంత ఐటమ్ సాంగ్
  • "ఊ అంటావా మావా ఊఊ అంటావా" అంటూ గీతం
  • హస్కీ వాయిస్ తో ఆలపించిన ఇంద్రావతి చౌహాన్
  • యూట్యూబ్ లో ఊపేస్తున్న పాట

పుష్ప చిత్రంలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. "ఊ అంటావా మావా ఊఊ అంటావా" అంటూ దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన చేసిన ఈ పాటకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్ కారణంగా పాటకు లైఫ్ వచ్చింది. సమంత అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లోకి వెళ్లింది. "ఊ అంటావా మావా..." పాట రీచ్ ఎలా ఉందంటే... బుడిబుడి నడకల చిన్నారులు సైతం హమ్ చేస్తున్నారు.

తాజాగా ఇంటర్నెట్లో ఓ వీడియో సందడి చేస్తోంది. ఆ వీడియోను సమంత తన సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకుంది. ఓ తల్లి తన కుమార్తెతో హోమ్ వర్క్ చేయిస్తూ... డబ్ల్యూహెచ్ఓ హూ అనే ఆంగ్ల పదాన్ని చదివించే ప్రయత్నం చేయగా... ఆ పదాన్ని చూసిన చిన్నారి "ఊ అంటావా మావా ఊఊ అంటానా" అని పాట ఎత్తుకుంది. అందుకు ఆ తల్లి స్పందిస్తూ.. "ఊ కాదు హూ" అని చెబితే మరోసారి ఆ చిన్నారి పాట పాడడం పట్ల సమంత ముగ్ధురాలైంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News