Balakrishna: 'అఖండ'కి సీక్వెల్ చేయాలనుందంటున్న నిర్మాత!

Akhanda movie update

  • 'అఖండ' హిట్ అవుతుందని నాకు తెలుసు 
  •  కథను బట్టే హీరోలను సంప్రదిస్తాను 
  • మార్చిలో మరో ప్రాజెక్టు ఉంటుంది 
  • కొత్త హీరోను పరిచయం చేస్తున్నానన్న నిర్మాత  

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా సంచనల విజయాన్ని నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను తన దూకుడు చూపుతూ, చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడారు.

'అఖండ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేను మొదటి నుంచి నమ్ముతూ వచ్చాను .. అదే జరిగింది. నేను ఆశించినట్టుగానే అఘోర పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనుంది. అయితే అందుకు అన్నీ కలిసి రావాలి. ఒకవేళ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటే అక్షయ్ కుమార్ గానీ .. అజయ్ దేవగణ్ గాని కరెక్టుగా సరిపోతారని అనుకుంటున్నాను.

హీరోలకు ముందుగా అడ్వాన్సులు ఇచ్చి బుక్ చేసుకోవడం నాకు అలవాటు లేదు. కథలను బట్టి .. పాత్రలను బట్టి అందుకు సెట్ అయ్యేవారి దగ్గరికి కథ తీసుకుని వెళ్లి వినిపించడమే నాకు తెలుసు. మార్చిలో ఒక సినిమాను మొదలుపెడుతున్నాను. ఈ సినిమాతో కొత్త హీరోను పరిచయం చేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

Balakrishna
Pragya Jaiswal
Boyapati Sreenu
Akhanda Sequel
  • Loading...

More Telugu News