Buddha Venkanna: సైలెంట్ గా ఉండే రాధాపై ఎవరు రెక్కీ చేశారో అందరికీ తెలుసు: బుద్ధా వెంకన్న

Buddha Venkanna opines on Vangaveeti Radha issue
  • తన హత్యకు రెక్కీ జరిగిందంటూ వెల్లడించిన రాధా
  • రాధా ఎవరి జోలికీ వెళ్లడన్న బుద్ధా వెంకన్న
  • ఇందులో వైసీపీ పెద్దల ప్రమేయం ఉందని ఆరోపణ
  • టీడీపీ ఆఫీసుపై దాడికి, రాధాపై రెక్కీకి లింకు ఉందని వ్యాఖ్య   
తన హత్యకు రెక్కీ జరిగిందంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపాయి. దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. వంగవీటి రాధా ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటున్నారని, తండ్రి ఆశయాల కోసం కృషి చేస్తున్నాడని వివరించారు. పరిస్థితులు చూస్తుంటే బెజవాడలో మళ్లీ పాతరోజులు వస్తాయేమోనన్న ఆందోళన కలుగుతోందని అన్నారు.

గతంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి, రాధాపై రెక్కీకి లింకు ఉందని పేర్కొన్నారు. సైలెంట్ గా ఉండే రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించారో అందరికీ తెలుసని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. దీంట్లో విజయవాడ నేతలతో పాటు వైసీపీ పెద్దల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. వైసీపీ పాలనలో అడ్డగోలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
Buddha Venkanna
Vangaveeti Radha
Recce
Vijayawada
TDP
YSRCP

More Telugu News