APPSC: రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
![APPSC issue notifications to fill Revenue and Endowment job vacancies](https://imgd.ap7am.com/thumbnail/cr-20211228tn61cb26692fbce.jpg)
- ఏపీలో ఉద్యోగ నియామకాలు
- రెవెన్యూ శాఖలో 670 ఖాళీలు
- దేవాదాయ శాఖలో 60 ఖాళీలు
- ఈ నెల 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చన్న ఏపీపీఎస్సీ
ఏపీలో రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ రంగంలోకి దిగింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, దేవాదాయ శాఖలో 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ నెల 30 నుంచి 2022 జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://psc.ap.gov.in) లో పొందుపరిచారు.