Sajjala Ramakrishna Reddy: పీఆర్సీ ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చు: సజ్జల

Sajjala says PRC announcement will be delayed

  • పీఆర్సీ కోసం ఉద్యోగుల ఉద్యమబాట
  • మెరుగైన పీఆర్సీ కోసం సీఎం ఆదేశించారన్న సజ్జల
  • మళ్లీ కసరత్తులు చేస్తున్నామని వెల్లడి
  • నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నట్టు వివరణ

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోరుతూ ఉద్యమిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పీఆర్సీ ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు మళ్లీ కసరత్తు చేస్తున్నామని చెప్పారు.

పీఆర్సీతో బడ్జెట్ పై పడే భారాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో పీఆర్సీ నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నారని వెల్లడించారు. పీఆర్సీ భారం అంచనా వల్లే ప్రక్రియ ఆలస్యం అయిందని అన్నారు.

మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని సీఎం ఆదేశించారని, ఉద్యోగులు అసంతృప్తి చెందకూడదన్నదే సీఎం ఉద్దేశం అని తెలిపారు. రేపటి నుంచి పీఆర్సీ ప్రక్రియ వేగవంతం అవుతుందని చెప్పారు. ఉద్యోగులకు ఫిట్ మెంట్ పెంచడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోందని సజ్జల వివరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News