YS Vivekananda Reddy: వైయస్ వివేకా హత్య కేసులో మరో మలుపు.. కోర్టును ఆశ్రయించిన వివేకా పీఏ!

YS Vivekananda Reddy PA approaches Pulivendula court
  • వివేకా పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి
  • సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల కోర్టులో ఫిర్యాదు
  • ఇతరుల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. వివేకా పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై లాయర్ లోకేశ్వర్ రెడ్డి ద్వారా ఫిర్యాదు చేశారు. హత్య కేసులో ఇతరుల పేర్లు చెప్పాలని ఆయన తనపై ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి, పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. సీబీఐకి మద్దతుగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు ఇతరుల పేర్లను చెప్పాలంటూ ఒత్తిడి తెస్తున్నారని కోర్టుకు తెలిపారు.

YS Vivekananda Reddy
PA Krishna Reddy
Pulivendula Court

More Telugu News