Krish: క్రిష్ పర్యవేక్షణలో వెబ్ సిరీస్ గా 'కన్యాశుల్కం'

Kanyashulkam Web Series

  • క్రిష్ నుంచి వచ్చిన 'కొండ పొలం'
  • సెట్స్ పై ఉన్న 'హరిహర వీరమల్లు'
  • 'కన్యాశుల్కం' స్క్రిప్ట్ రెడీ 
  • సోనీ లివ్ కోసం రంగంలోకి  

ఇటీవల 'కొండ పొలం' అనే పుస్తకం ఆధారంగా అదే టైటిల్ తో క్రిష్ ఒక సినిమాను తెరకెక్కించాడు. ఇక ప్రస్తుతం ఆయన పవన్ కల్యాణ్ హీరోగా 'హరి హర వీరమల్లు' సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, త్వరలో మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో 'కన్యాశుల్కం' నాటకాన్ని వెబ్ సిరీస్ గా చిత్రీకరించడానికి క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేయించినట్టుగా చెబుతున్నారు. సోనీ లివ్ ఓటీటీ కోసం క్రిష్ ఈ వెబ్ సిరీస్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఆయన కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తాడని చెబుతున్నారు.

ఇక దర్శకుడు ఎవరు? నటీనటులు ఎవరనే విషయాలు త్వరలో తెలియనున్నాయి. తెలుగు సాహిత్యంలో 'కన్యాశుల్కం' నాటకానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గురజాడ అప్పారావు రచించిన ఈ నాటకం అప్పట్లో సినిమాగా వచ్చి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.

Krish
KanyaShulkam
Tollywood
  • Loading...

More Telugu News