Sensex: మొదట్లో నష్టాల్లోకి జారుకుని.. చివర్లో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 296 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 83 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.40 శాతం పెరిగిన టెక్ మహీంద్రా షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా పడిపోయింది. ఒమిక్రాన్ నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అయినప్పటికీ... చివరకు లాభాల్లో ముగిశాయి.

ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 296 పాయింట్లు లాభపడి 57,420కి పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకుని 17,086 వద్ద స్థిరపడింది. మెటల్ మినహా ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.40%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.95%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.60%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.56%), సన్ ఫార్మా (1.17%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.55%), ఏసియన్ పెయింట్స్ (-0.44%), మారుతి సుజుకి (-0.32%), భారతి ఎయిర్ టెల్ (-0.23%), ఐటీసీ (-0.21%).

  • Loading...

More Telugu News