Andhra Pradesh: ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులపై ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు
- ఇటీవల జీవో 53, 54లను జారీ చేసిన వైసీపీ ప్రభుత్వం
- ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను మీరెలా నిర్ణయిస్తారని ప్రశ్నించిన హైకోర్టు
- స్కూలు, కాలేజీల అభిప్రాయాలు తీసుకున్నాకే ఖరారు చేయమని ఆదేశాలు
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ ఇటీవల వైసీపీ ప్రభుత్వం జీవో 53, 54లను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.
ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు... ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల ఫీజులను మీరెలా నిర్ణయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిబంధనలు, చట్టాలకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చారని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ స్కూలు, జూనియర్ కాలేజీ అభిప్రాయాలను తీసుకున్నాకే ఫీజులు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో 53, 54లను కొట్టివేసింది. మరోవైపు ప్రైవేట్ విద్యాసంస్థల తరపున న్యాయవాది ముతుకుమల్లి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.