Ajinkya Rahane: నిన్న బ్యాటింగ్ చేస్తోన్న స‌మ‌యంలో ప‌దే ప‌దే ర‌హానే చేసిన వ్యాఖ్య‌ల వీడియో వైర‌ల్

Ajinkya Rahane Constantly Mutters Watch The Ball
  • బంతిని చూడు అంటూ త‌న‌కు తాను చెప్పుకున్న ర‌హానే
  • ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తోన్న నెటిజ‌న్లు
  • నిన్న 40 ప‌రుగులు చేసిన రహానే
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచు తొలి రోజు ఆట‌లో టీమిండియా టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ రాణించిన విష‌యం తెలిసిందే. క్రీజులో ప్రస్తుతం కేఎల్ రాహుల్‌(122)తో పాటు అజింక్యా రహానే (40‌) ఉన్నారు. అయితే, నిన్న ర‌హానే బ్యాటింగ్ చేస్తోన్న స‌మ‌యంలో ప‌దే ప‌దే వాచ్ ది బాల్ (బంతిని చూడు) అంటూ త‌న‌కు తాను చెప్పుకోవడం గ‌మ‌నార్హం. ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

ర‌హానే అలా చెప్పుకోవ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంద‌ని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచులో ర‌హానేకు చోటు ద‌క్క‌డం ప‌ట్ల ముందు అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. చివ‌ర‌కు శ్రేయాస్, హ‌నుమ విహారిని కాద‌ని సెలెక్ట‌ర్లు ర‌హానేను ఈ మ్యాచులో ఆడించ‌డం గ‌మ‌నార్హం. ర‌హానే కూడా మ్యాచులో బాగా రాణించాడు.
Ajinkya Rahane
Cricket
Viral Videos

More Telugu News