Parampara: ప్రెస్ నోట్: దూసుకుపోతోన్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు ఒరిజినల్ డ్రామా సిరీస్ పరంపర!

Parampara Disney Plus Hotstars new Telugu Series
  • డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో డిసెంబర్ 24 న రిలీజ్ అయిన 'పరంపర'
  • పగ ప్రతీకారాల నేపథ్యంలో సిరీస్
  •  మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథ

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో కొత్త వెబ్ సిరీస్ 'పరంపర' డిసెంబర్ 24 రిలీజ్ అయ్యింది. అధికారం, పగ ప్రతీకారాల నేపథ్యంలో ఈ సిరీస్ చిత్రీకరించారు. ఇందులో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా ప్రొడక్షన్స్ అధినేత ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.
 
జగపతి బాబు మాట్లాడుతూ.. ‘అద్భుతమైన నటీనటులంతా ఒకే చోటకు వస్తే అద్భుతమైన ప్రొడక్ట్ బయటకు వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అలా అందరినీ ఒకే చోటకు తీసుకొస్తుంది. ప్రెష్ టాలెంట్, క్రియేటివ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక మున్ముందు తెలుగులో చెప్పే కథల స్థాయి పెరగనుంది’ అని అన్నారు.
 
“మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథ అని, పెర్సనల్ ఎక్స్ పీరియన్స్ తో రాశానని” రైటర్ హరి ఏలేటి ఎమోషనల్ గా చెప్పారు. 'పరంపర' అనేది వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ. ఫ్యామిలీ, యాక్షన్, లవ్, ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సిరీస్ లో ఉంటాయి. ఫస్ట్ సీజన్ ప్రేక్షకులకు గ్యారంటీ గా నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చారు హీరో నవీన్ చంద్ర.
 
Content Produced by: Indian Clicks, LLC
Parampara
Jagapathi Babu
Sarath Kumar
OTT
Disney Plus Hotstar

More Telugu News