ASIGMA: భారత సైనికుల కోసం వాట్సాప్ తరహాలో అత్యంత సురక్షితమైన యాప్

Indian army developed ASIGMA app for internal use

  • అసిగ్మా యాప్ ను అభివృద్ధి చేసిన సైన్యం
  • భద్రతాపరంగా అత్యుత్తమమైనదంటున్న సైన్యం
  • కేవలం సైనికుల వరకే పరిమితం
  • ఇప్పటివరకు అవాన్ యాప్ వినియోగిస్తున్న సైన్యం

టెక్ యుగంలో సమాచార గోప్యత అత్యంత క్లిష్టమైన సమస్యగా కొనసాగుతోంది. దిగ్గజ సంస్థలు సైతం డేటా భద్రత కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటాయి. కీలక సమాచారం హ్యాకర్ల బారినపడితే జరిగే అనర్థాలు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత సైన్యం జవాన్ల కోసం అత్యంత సురక్షితమైన మెసేజింగ్ యాప్ ను తీసుకువచ్చింది. దీని పేరు అసిగ్మా (ASIGMA-Army Secure IndiGeneous Messaging Application).

ఇది వాట్సాప్ తరహా యాప్. దీన్ని భారత సైన్యంలోని కమ్యూనికేషన్స్ మరియు సిగ్నల్స్ విభాగం అధికారులు రూపొందించారు. ఇప్పటివరకు సైన్యంలో అంతర్గతంగా సందేశాలు పంపుకునేందుకు అవాన్ (AWAN-Army Wide Area Network) యాప్ ను గత 15 ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు.

అయితే అసిగ్మా యాప్ భద్రతాపరంగా అత్యంతర సురక్షితమైనదని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవాన్ ను అసిగ్మాతో భర్తీ చేయనున్నారు. ఈ వెబ్ బేస్డ్ యాప్ కేవలం ఆర్మీకి మాత్రమే పరిమితం. ఇతర యాప్ స్టోర్లలో దీన్ని విడుదల చేయడంలేదు.

  • Loading...

More Telugu News