బాక్సాఫీసు వద్ద పుష్పరాజ్ హంగామా... తొలి వారం రూ.229 కోట్ల వసూళ్లు
- అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప
- ఈ నెల 17న పుష్ప రిలీజ్
- తొలిరోజే రూ.71 కోట్ల గ్రాస్ తో ఆలిండియా రికార్డు
- మరో రెండు వారాలు పుష్ప జోరు కొనసాగే అవకాశం
ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ విడుదలైనప్పటికీ... మరో రెండు వారాల పాటు పుష్ప హవా కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించగా, సునీల్, అనసూయ, ఫహద్ ఫజల్ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.