Chiranjeevi: నాన్న గారి సంవత్సరీకం సందర్భంగా ఆయన స్మృతులని తలుచుకుంటూ..: చిరంజీవి

Chiranjeevi pays tribute to his father

  • ఏ లోకంలో వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
  • ఆయ‌న‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము
  • నాగ‌బాబుతో క‌లిసి దిగిన ఫొటో పోస్ట్ చేసిన‌ చిరంజీవి

త‌న తండ్రి సంవత్సరీకం సందర్భంగా ఆయ‌న‌ను త‌లుచుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తమ ఇంట్లో తండ్రికి ఆచారం ప్ర‌కారం చేసిన పూజ‌ల‌కు సంబంధించిన ఫొటోను ఆయ‌న పోస్ట్ చేశారు. ఇందులో త‌న పెద్ద‌ త‌మ్ముడు నాగ‌బాబుతో క‌లిసి త‌న తండ్రి ఫొటో వ‌ద్ద‌ నమస్కరిస్తూ చిరంజీవి క‌న‌ప‌డుతున్నారు.
                    
'నాన్న గారి సంవత్సరీకం సందర్భంగా ఆయన స్మృతులని తలుచుకుంటూ, మాకు జన్మనిచ్చిన ఆ మహనీయుడు ఏ లోకంలో వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Chiranjeevi
Tollywood
nagababu
  • Loading...

More Telugu News