Radhe Shyam: రామోజీ ఫిలింసిటీలో రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్... ట్రైలర్ రిలీజ్

Radhe Shyam trailer released in pre release event
  • పీరియాడిక్ మూవీగా రాధేశ్యామ్
  • ప్రభాస్, పూజాహెగ్డే జంటగా చిత్రం
  • రాధాకృష్ణ దర్శకత్వం
  • జనవరి 14న రిలీజ్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో, రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు రామోజీ ఫిలింసిటీలో షురూ అయింది. ఈ కార్యక్రమంలోనే చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్ అభిమానులందరి తరఫున సీనియర్ నటుడు కృష్ణంరాజు ట్రైలర్ ను ఆవిష్కరించారు. ట్రైలర్ ఆవిష్కరణ సమయంలో కృష్ణంరాజు వెంట హీరో ప్రభాస్ కూడా ఉన్నారు.
Radhe Shyam
Trailer
Pre Release
Prabhas
Tollywood

More Telugu News