Andhra Pradesh: ఏపీలో మరో 103 కరోనా కేసుల వెల్లడి
![AP Corona StatisticsBulletin](https://imgd.ap7am.com/thumbnail/cr-20211222tn61c3040c41033.jpg)
- గత 24 గంటల్లో 28,670 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 1,358 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 28,670 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 103 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 16, విశాఖ జిల్లాలో 12, తూర్పు గోదావరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 175 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,077 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,60,236 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,358 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,483కి పెరిగింది.
![](https://img.ap7am.com/froala-uploads/20211222fr61c303fd3d50d.jpg)