corona: సులభ చికిత్సతోనే ఒమిక్రాన్ నుంచి కోలుకోవచ్చు: దక్షిణాఫ్రికా వైద్యులు

with simple treatment to come out from omicron

  • ఎక్కువ మందిలో తలనొప్పి, అలసట
  • కార్టిసోన్, ఇబూప్రోఫెన్ తో త్వరగా కోలుకుంటున్నారు
  • టీకాలు తీసుకున్న వారిలో స్వల్ప లక్షణాలు
  • డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ వెల్లడి

కరోనా ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండడాన్ని చూసి ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. మరోవైపు ఈ కొత్త రకం మొదటగా వెలుగు చూసిన దక్షిణాఫ్రికాకు చెందిన వైద్యులు ‘ఏం ఫర్వాలేదు.. సులభ చికిత్సతోనే దీన్నుంచి కోలుకోవచ్చు’ అని చెబుతుండడం ఊరటనిచ్చేదే. కరోనా ఒమిక్రాన్ రకం మొదట ఆఫ్రికాలో వెలుగు చూసినప్పటికీ.. ఇప్పటికే చాలా దేశాలకు పాకిపోయింది. రోగనిరోధక వ్యవస్థకు దొరక్కుండా ఇది శరీరంలో విస్తరిస్తుందన్నది వైద్యులు చెబుతున్నమాట.

అయినప్పటికీ దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ ను ముందుగా గుర్తించిన డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ సాధారణ చికిత్సతోనే త్వరగా కోలుకోవచ్చని చెబుతున్నారు. ‘‘స్వల్ప మోతాదులో కార్టిసోన్ (స్టెరాయిడ్) ఇస్తున్నాం. తలనొప్పి, కండరాల నొప్పులకు ఉపశమనంగా ఇబూప్రోఫెన్ తో చికిత్స చేస్తున్నాం. ఎక్కువ కేసుల్లో తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులే కనిపించాయి’’ అని డాక్టర్ వివరించారు. చాలా తక్కువ మందికే ఐసీయూ చికిత్స అవసరమైందన్నారు. టీకా తీసుకున్న వారిలో వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్నట్టు చెప్పారు.

corona
omicron
treatment
southafrica
doctors
  • Loading...

More Telugu News