rohit sharma: ఈ భారత క్రికెట్ దిగ్గజానికి బౌలింగ్ చేయడం కష్టం: పాక్ బౌలర్ షాదాబ్ ఖాన్

This Indian Batter Is Most Difficult To Bowl To

  • అభిమానులతో ముచ్చటించిన షాదాబ్ ఖాన్ 
  • రోహిత్ శర్మకు బౌల్ చేయడం ఇబ్బందే
  • ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు కూడా కష్టమే 

తన ప్రతిభతో అంతర్జాతీయ వార్తల్లో ప్రముఖంగా కనిపించే పాకిస్తాన్ యువ స్టార్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ భారత బ్యాట్స్ మ్యాన్ లలో ఒకరికి బౌలింగ్ చేయడం కష్టమనిపించినట్టు చెప్పాడు. ఈ లెగ్ స్పిన్నర్ ఇటీవలే ట్విట్టర్ లో తన అభిమానులతో ముచ్చటిస్తూ.. ప్రశ్న, జవాబుల కార్యక్రమాన్ని నిర్వహించాడు.

ఈ సందర్భంగా ఒక అభిమాని నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. బౌలింగ్ చేయడానికి మీకు అత్యంత కష్టంగా అనిపించిన బ్యాట్స్ మ్యాన్ ఎవరు? అన్నదే ఆ ప్రశ్న. దీనికి షాదాబ్ ఖాన్ స్పందిస్తూ.. భారత్ కు చెందిన స్కిప్పర్ రోహిత్ శర్మ (టీమిండియా కెప్టెన్)కు బౌల్ వేయడం తనకు కష్టంగా అనిపించినట్టు చెప్పాడు. అలాగే, తాను బౌలింగ్ చేసిన వారిలో కష్టంగా అనిపించిన వారిలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఒకరని ఖాన్ పేర్కొన్నాడు.

rohit sharma
David Warner
shadab khan
  • Loading...

More Telugu News