KTR: దూరాభారాన్ని అధిగమించిన అభిమానం.. కేటీఆర్ ని కలవడానికి 750 కిలోమీటర్లు నడిచొచ్చిన శ్రీకాకుళం జిల్లా యువకుడు

Srikakualam dist guy walks 750 km to meet ktr

  • కేటీఆర్‌పై విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్న శేఖర్
  • రాజాం నుంచి గత నెల 30న మొదలైన పాదయాత్ర
  • ప్రగతి భవన్‌కు వచ్చి కలవాలంటూ కేటీఆర్ నుంచి ఆహ్వానం

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై పెంచుకున్న అభిమానం ఓ యువకుడిని 780 కిలోమీటర్ల దూరం నడిపించింది. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన శేఖర్ అనే యువకుడికి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అంటే విపరీతమైన అభిమానం. దీంతో పాదయాత్రగా వెళ్లి ఆయనను కలవాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా గత నెల 30న పాదయాత్రగా బయలుదేరాడు. ఈ నెల 19న హైదరాబాద్ చేరుకున్న శేఖర్‌ను.. ప్రగతి భవన్‌కు వచ్చి తనను కలవాలని కేటీఆర్ ఆహ్వానించారు. కేటీఆర్ ఆహ్వానంపై శేఖర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

KTR
Srikakulam District
Rajam
Andhra Pradesh
Padayatra
  • Loading...

More Telugu News