LS Member App: ఎల్ఎస్ మెంబర్ యాప్... ఇకపై లోక్ సభ సమావేశాలను ఈ యాప్ లో చూడొచ్చు!
- ఎల్ఎస్ మెంబర్ యాప్ ను ఆవిష్కరించిన స్పీకర్
- యాప్ గురించి సభ్యులకు వివరణ
- లోక్ సభ సభ్యులందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచన
- ప్రజలు కూడా దీన్ని వినియోగించేలా ప్రోత్సహించాలన్న స్పీకర్
లోక్ సభ సమావేశాల లైవ్ కాస్ట్ కోసం ప్రత్యేక యాప్ ను తీసుకువచ్చారు. ఈ యాప్ పేరు ఎల్ఎస్ మెంబర్ యాప్. దీన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేడు సభా సమావేశాల ప్రశ్నోత్తరాల వేళ ఆవిష్కరించారు. ప్రతి ఒక్క లోక్ సభ సభ్యుడు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, తమ నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని డౌన్ లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలని ఓం బిర్లా సూచించారు. ఇందులో లోక్ సభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం మాత్రమే కాదు, ప్రశ్నోత్తరాలు, చర్చలు, బులెటిన్లు, ముఖ్యమైన పత్రాలు, పలు కమిటీల నివేదికలు ఉంటాయి.