S-400: ఎస్-400 ఆయుధ వ్యవస్థను మొట్టమొదటిగా పంజాబ్ లో మోహరించిన వాయుసేన

India deploys its first air defence system in Punjab sector

  • ఎస్-400ల కొనుగోలుకు రష్యాతో ఒప్పందం
  • రూ.35 వేల కోట్లతో డీల్
  • ఈ నెల మొదటి వారం నుంచి భారత్ కు విడిభాగాలు
  • మరికొన్ని వారాల్లో పని ప్రారంభించనున్న తొలి స్క్వాడ్రన్

రష్యా నుంచి కొనుగోలు చేసిన శత్రు భీకర ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత వాయుసేన మొదటగా పంజాబ్ సెక్టార్ లో మోహరించింది. దేశంలో తొలి ఎస్-400 స్క్వాడ్రన్ ఇదే. పాకిస్థాన్, చైనా నుంచి ఎదురయ్యే గగనతల సవాళ్లకు ఇదే జవాబు అని కేంద్ర వర్గాలు తెలిపాయి.

400 కిమీ పరిధిలో ఎదురయ్యే ముప్పును పసిగట్టి, శత్రు ఆయుధాలను మధ్యలోనే తుత్తునియలు చేయడం ఈ రష్యా తయారీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకత. ఇది ఏక కాలంలో పాక్, చైనాలపై దృష్టి సారించగలదు.

గగనతల రక్షణ వ్యవస్థను అత్యంత పటిష్ఠం చేసేందుకు భారత్ తన మిత్ర దేశం రష్యాతో రూ.35 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ లో ఐదు ఎస్-400 స్క్వాడ్రన్ల ఏర్పాటుకు అవసరమయ్యే ఆయుధ సంపత్తిని రష్యా సరఫరా చేస్తుంది. ఈ నెల ఆరంభంలో రష్యా నుంచి భారత్ కు ఎస్-400 విడిభాగాల సరఫరా షురూ అయింది. కాగా, పంజాబ్ లో ఏర్పాటు చేసిన తొలి యూనిట్ మరికొన్ని వారాల్లో కార్యకలాపాలు ప్రారంభించనుందని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News