Chandrababu: "హ్యాపీ బర్త్ డే జగన్"... ఏపీ సీఎంకు సింపుల్ గా విషెస్ తెలిపిన చంద్రబాబు

Chandrababu wishes AP CM YS Jagan in a simple way

  • నేడు సీఎం జగన్ పుట్టినరోజు
  • 49వ ఏట అడుగుపెట్టిన జగన్
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
  • చంద్రబాబు ట్వీట్ కు విశేష స్పందన

ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన 49వ ఏట అడుగుపెడుతున్నారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, విపక్ష నేత చంద్రబాబు కూడా సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఎంతో సాధారణ రీతిలో ఏక వాక్యంతో "హ్యాపీ బర్త్ డే జగన్" అంటూ విషెస్ తెలియజేశారు. అంతకుమించి ఆయన స్పందించలేదు. చంద్రబాబు ట్వీట్ కు విశేష స్పందన వస్తోంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేల లైకులు, కామెంట్లు వచ్చాయి.

Chandrababu
YS Jagan
Birthday Wishes
Andhra Pradesh
  • Loading...

More Telugu News