Komatireddy Venkat Reddy: ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసిన విద్యార్థులందరికీ వచ్చే ఎన్నికల నాటికి ఓటు హక్కు వస్తుంది... కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy fires on CM KCR over Inter results
  • తెలంగాణలో ఇంటర్ ఫలితాల రగడ
  • ఫస్టియర్ లో 51 శాతం మంది ఫెయిల్
  • ముగ్గురు విద్యార్థుల బలవన్మరణం
  • కేసీఆర్ పై ధ్వజమెత్తిన కోమటిరెడ్డి
ఇటీవల తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు వెల్లడి కాగా, పరీక్ష రాసిన వారిలో సగానికి పైగా ఫెయిల్ అయ్యారు. కేవలం 49 శాతం మందే పాసయ్యారు. ఫెయిల్ అయ్యామన్న వేదనతో రాష్ట్రంలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఇంటర్ బోర్డు తీరు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

"కేసీఆర్ గుర్తుపెట్టుకో... ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసిన విద్యార్థులందరికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటు హక్కు వస్తుంది. వారి జీవితాలతో చెలగాటమాడుతున్న మీకు, మీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బాధిత విద్యార్థులు తగిన బుద్ధిచెప్పడం ఖాయం!" అని వ్యాఖ్యానించారు.
Komatireddy Venkat Reddy
CM KCR
Inter
Results
Students

More Telugu News