Visakhapatnam District: 15 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన బాలుడి అరెస్ట్

Boy arrested for making girl preganant
  • విశాఖపట్టణం జిల్లా చింతపల్లి మండలంలో ఘటన
  • బాలికతో పరిచయం పెంచుకుని శారీరక సంబంధం
  • 8 నెలల గర్భిణి అని తెలిసి హతాశులైన తల్లిదండ్రులు
  • బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలింపు
బాలికతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా ఉంటూ ఆపై గర్భవతిని చేశాడో బాలుడు. విశాఖపట్టణం జిల్లా, చింతపల్లి మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తాజంగి పంచాయతీలోని బోయపాడుకు చెందిన బాలిక తొమ్మిదో తరగతి పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఇంటర్ పూర్తిచేసి గ్రామంలోనే ఉంటున్నాడు.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెరిగిన పరిచయం ప్రేమగా మారింది. అది శారీరక సంబంధానికి దారి తీసింది. ఇటీవల బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆమెను నర్సీపట్నం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక 8 నెలల గర్భవతి అని చెప్పడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు.
Visakhapatnam District
Chintapalle
Boy
Girl

More Telugu News