Kodali Nani: నారా భువనేశ్వరి చెప్పింది నిజమే... ఎవరి పాపాన వాళ్లే పోతారు: మంత్రి కొడాలి నాని

Kodali Nani reacts to Nara Bhuvaneswari remarks

  • తిరుపతిలో భువనేశ్వరి వ్యాఖ్యలు
  • పాపాత్ములు అనిపించుకోవద్దంటూ హితవు
  • స్పందించిన మంత్రి కొడాలి నాని
  • ఆమె వ్యాఖ్యలు చంద్రబాబుకే వర్తిస్తాయని వివరణ

తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్టు కార్యక్రమంలో నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి చెప్పింది నిజమేనని, చెడు వ్యాఖ్యలు చేసినవాళ్లు ఎవరి పాపాన వాళ్లే పోతారని వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు చంద్రబాబుకే వర్తిస్తాయని అన్నారు.

భార్య పేరును రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకే చెల్లుతుందని, ఆమె శాపం బాబుకు తప్పకుండా తగులుతుందని తెలిపారు. ఆడవాళ్లను రోడ్డుమీదికి తెచ్చింది ఎవరు? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆడవాళ్ల ఉసురుతగలడం ఖాయమని, వచ్చే ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా పోతుందని జోస్యం చెప్పారు.

Kodali Nani
Nara Bhuvaneswari
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News