Vijay Devarakonda: ముంబైలో విజయ్ దేవరకొండ, రష్మిక చక్కర్లు!

Vijay Devarakonda and Rashmika Mandanna in Mumbai
  • విజయ్, రష్మిక మధ్య రిలేషన్ షిప్ ఉందంటూ కొంత కాలంగా వార్తలు
  • ముంబైలో కెమెరా కంటికి చిక్కిన జంట
  • బాంద్రాలో రెస్టారెంట్ కు వెళ్లిన విజయ్, రష్మిక
గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, వీరిద్దరిలో ఏ ఒక్కరు కూడా వారి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి బహిరంగంగా మాట్లాడలేదు. తాజాగా వారిద్దరూ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కారు.

 విజయ్ తాజా చిత్రం 'లైగర్' షూటింగ్ ముంబైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ముంబైలోని బాంద్రాలో ఓ రెస్టారెంట్ కు వీరిద్దరూ వెళ్తూ కెమెరా కంటికి దొరికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ప్రేమజంట దొరికిపోయారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
Vijay Devarakonda
Rashmika Mandanna
Tollywood
Mumbai

More Telugu News