Raviteja: రవితేజతో కలిసి రచ్చ చేయనున్న పాయల్!

Payal in Raviteja Movie

  • 'ఆర్ ఎక్స్ 100'తో క్రేజ్
  • రొమాంటిక్ బ్యూటీగా పేరు
  • వెబ్ సిరీస్ లతోను బిజీ
  • ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్  

టాలీవుడ్ లో భారీ అందాల భామగా పాయల్ కి క్రేజ్ ఉంది. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ సుందరి, రొమాంటిక్ సీన్స్ లోను .. సాంగ్స్ లోను తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆ మధ్య 'సీత' సినిమాలో 'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' ఐటమ్ తో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది.

ఒక వైపున కథానాయికగా తనకి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూనే, మరో వైపున వెబ్ సిరీస్ లతోను బిజీ అవుతోంది. ఇక హాట్ హాట్ ఐటమ్ లో ఛాన్స్ వచ్చినా ఈ బ్యూటీ వదులుకోవడం లేదు. తాజాగా 'ధమాకా' సినిమాలో రవితేజతో కలిసి ఒక ఐటమ్ లో చిందేయనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఇందులోని ఒక మాస్ నెంబర్ కి ముందుగా అనసూయను అనుకున్నారు. ఆ తరువాత ఏమైందో తెలియదు గాని, తాజాగా పాయల్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా 'పెళ్లి సందD' ఫేమ్ శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే.

Raviteja
Payal Rajputh
Nakkina Trinatha Rao Movie
  • Loading...

More Telugu News