Telangana: విద్యార్థులందరినీ పాస్ చేయించాలని డిమాండ్.. తెలంగాణలో నేడు జూనియర్ కళాశాలల బంద్

Inter Colleges in telangana to be closed today

  • పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు
  • జవాబు పత్రాలను ఉచితంగా పునఃపరిశీలించాలని డిమాండ్
  • రుసుము లేకుండా ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు నిర్వహించాలన్న సంఘాలు

తెలంగాణ వ్యాప్తంగా నేడు జూనియర్ కళాశాలలు మూతపడనున్నాయి. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులనందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌వో నిన్న ప్రకటించాయి.

ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేయించడంతోపాటు జవాబు పత్రాలను ఉచితంగా పునఃపరిశీలించాలని, ఫీజు లేకుండా ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.

Telangana
Junior Colleges
Student Unions
  • Loading...

More Telugu News