Team India: అండర్-19 వరల్డ్ కప్ లో ఆడే టీమిండియా వైస్ కెప్టెన్ గా గుంటూరు కుర్రాడు

Team India under ninteen team announced

  • వచ్చే ఏడాది వెస్టిండీస్ లో వరల్డ్ కప్
  • టీమిండియా అండర్-19 జట్టు ప్రకటన
  • కెప్టెన్ గా యశ్ ధుల్
  • గుంటూరు ప్లేయర్ షేక్ రషీద్ కు జట్టులో చోటు

వచ్చే ఏడాది ప్రథమార్థంలో వెస్టిండీస్ వేదికగా అండర్-19 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ నేడు ప్రకటించింది. టీమిండియా అండర్-19 జట్టులో గుంటూరు ఆటగాడు షేక్ రషీద్ కు చోటు దక్కింది. విశేషం ఏంటంటే... రషీద్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. ఈ జట్టుకు కెప్టెన్ గా యశ్ ధుల్ వ్యవహరిస్తాడు. ఈ టోర్నీ 2022 జనవరి 14న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ నేడు ఎంపిక చేసింది.

టీమిండియా అండర్-19 ఆటగాళ్లు వీరే...

యశ్ ధుల్ (కెప్టెన్), షేక్ రషీద్ (వైస్ కెప్టెన్), రవికుమార్, రాజ్ అంగద్ బవా, అనీశ్వర్ గౌతమ్, హర్నూర్ సింగ్, గర్వ్ సంగ్వాన్, వసు వాత్స్, మానవ్ పరాక్, ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), దినేశ్ బనా (వికెట్ కీపర్), సిద్ధార్థ్ యాదవ్, కుశాల్ తంబే, విక్కీ ఉత్సవల్, అంగ్ క్రిష్ రఘువంశీ, ఆర్ఎస్ హంగర్కేర్, నిశాంత్ సింధు.

ఇక స్టాండ్ బై ఆటగాళ్లుగా అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, రిషిత్ రెడ్డి, పీఎం సింగ్ రాథోడ్, ఉదయ్ శరవణ్, అన్ష్ ఘోసాయ్ లను ఎంపిక చేశారు.

Team India
Under-19
Sheik Rashid
Guntur
  • Loading...

More Telugu News