Mass Marriages: రూ.35 వేల కోసం... పెళ్లి చేసుకున్న అన్నాచెల్లెలు!

Brother and sister married for cash and freebies

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • ఫిరోజాబాద్ జిల్లాలో సామూహిక వివాహాలు
  • అనేక నకిలీ జంటలను గుర్తించిన అధికారులు
  • పలువురిని ప్రలోభాలకు గురిచేసిన ఇద్దరు వ్యక్తులు

ఉత్తరప్రదేశ్ లో విస్మయం కలిగించే సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు తోబుట్టువులు పెళ్లి చేసుకున్నారు. డబ్బు కోసమే వారు ఈ పని చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ నెల 11న సామూహిక వివాహాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పచోక్రా జిల్లా నుంచి కూడా జంటలు హాజరయ్యాయి. పచోక్రా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన జ్యోతి అనే అమ్మాయి కూడా ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్లి చేసుకుంది తోడబుట్టిన అన్ననే!

ప్రభుత్వం నిర్వహించే ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో పెళ్లి చేసుకుంటే రూ.35 వేలు నగదు ఇవ్వడంతో పాటు, కొన్ని ఉచిత పథకాలు అందిస్తారని జ్యోతి, ఆమె అన్న ఆశపడ్డారు. వారే కాదు, పలు నకిలీ జంటలు ఈ విధంగా డబ్బు కోసం పెళ్లి చేసుకున్నట్టు వెల్లడైంది.

సోను అనే టైలర్, ఫిరోజ్ ఖాన్ అనే పారిశుద్ధ్య కార్మికుడు అనేకమంది నకిలీ జంటలను సామూహిక వివాహ కార్యక్రమానికి తరలించినట్టు గుర్తించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని అందుకోవడం కోసం పెద్ద ఎత్తున జంటలు కావాల్సి రావడంతో వీరిద్దరూ అనేకమందిని ప్రలోభాలకు గురిచేసి ఫిరోజాబాద్ జిల్లాలో సామూహిక వివాహ కార్యక్రమానికి తరలించారు. అలా తరలించినవారిలో జ్యోతి, ఆమె సోదరుడు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News