CM Jagan: ఎల్లుండి తణుకులో పర్యటించనున్న సీఎం జగన్

CM Jagan will tour in Tanuku

  • ఈ నెల 21న పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం పర్యటన
  • తణుకులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న జగన్
  • సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభం
  • ఆపై బహిరంగ సభలో ప్రసంగం

ఏపీ సీఎం జగన్ ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 21న ఆయన తణుకులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో పయనమవుతారు. 11 గంటలకు తణుకు చేరుకుంటారు.

తొలుత 'జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం' ప్రారంభిస్తారు. ఆపై బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్రపతి రోడ్డులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి తిరుగు పయనమవుతారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

CM Jagan
Tanuku
Tour
YSRCP
West Godavari District
Andhra Pradesh
  • Loading...

More Telugu News