Allu Arjun: స్వాతంత్య్రం రావడానికి ముందు కాలానికి బన్నీ, బోయపాటి!

Allu Arjun in Boyapati movie

  • 'అఖండ'తో బోయపాటికి హిట్
  •  భారీ ఓపెనింగ్స్ తెచ్చిన 'పుష్ప'
  • మరోసారి ఇద్దరి కాంబినేషన్
  • మొదలుకానున్న కసరత్తు  

అల్లు అర్జున్ తాజా చిత్రంగా రూపొందిన 'పుష్ప' థియేటర్లలో దూసుకుపోతోంది. తొలి రోజున భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా తన జోరు చూపుతోంది. ఈ సినిమా తరువాత ఆయన బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆల్రెడీ గతంలో ఈ ఇద్దరూ కలిసి 'సరైనోడు'తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

అటు 'అఖండ' సక్సెస్ తో బోయపాటి మాంచి ఉత్సాహంగా ఉన్నాడు. ఇక ఇటు 'పుష్ప' తరువాత బన్నీ కాస్త ఫ్రీ అయ్యాడు. అందువలన ఇక వీరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు వేగవంతం కానున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితం కానుంది.

ఈ సినిమా కథ భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వం నడుస్తుందట. ఆ కాలంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. బన్నీకి ఈ కథ ఒక రేంజ్ లో నచ్చేసిందని చెప్పుకుంటున్నారు. ఇక పూర్తిస్థాయి స్క్రిప్ట్ పై బోయపాటి కూర్చోనున్నట్టు సమాచారం.

Allu Arjun
Boyapati Sreenu
Geetha Arts
  • Loading...

More Telugu News