Mukhtar Abbas Naqvi: పెళ్లి ఆలస్యమైతే ఆడపిల్లలు తిరుగుబోతులు ఎందుకవుతారు?: ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
- అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచబోతున్న కేంద్రం
- ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
- కేంద్రం నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్న పలువురు విపక్ష నేతలు
మహిళల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై పలువురు విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోగల అమ్మాయిలు... వారికి కావాల్సిన భర్తను ఎంచుకోలేరా? అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
మరోవైపు కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. 21 ఏళ్లకు ఆడపిల్లలకు పెళ్లి చేస్తే వారు తిరుగుబోతులుగా మారతారని కొందరు అంటున్నారని... వాళ్లెందుకు తిరుగుబోతులవుతారని ప్రశ్నించారు. అమ్మాయిలపై మీకు నమ్మకం లేదా? అని అడిగారు. 'ఇది హిందుస్థానీ మైండ్ సెట్ కాదని, తాలిబానీ మైండ్ సెట్' అని మంత్రి అన్నారు.