Bandi Sanjay: కేసీఆర్ ఔరంగజేబులా మారితే తెలంగాణలోనూ శివాజీలు పుట్టుకొస్తారు: బండి సంజయ్

Bandi Sanjay comments on CM KCR

  • వారణాసిలో మోదీ దివ్య కాశీ భవ్య కాశీ కార్యక్రమం
  • కేసీఆర్ విమర్శలు చేశారన్న సంజయ్
  • దేశంలో ఎవరూ విమర్శించలేదని వ్యాఖ్య  
  • కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఉద్ఘాటన

తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రులతోనూ, ఎమ్మెల్యేలతోనూ సమావేశం ఏర్పాటు చేసి ఏం వాగాలో అంతా వాగారని వ్యాఖ్యానించాడు.

"అన్ని విషయాలు బయటికొస్తుండేసరికి వాళ్ల ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోతున్నారు... కేసీఆర్ ఇంత భయపడుతున్నాడేంటి? అనుకుంటున్నారు" అని వెల్లడించారు. ప్రధాని మోదీ వారణాసిలో నిర్వహించిన దివ్య కాశీ భవ్య కాశీ కార్యక్రమంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రిగా ఆయన స్థాయికి తగనివని అన్నారు.

దివ్య కాశీ భవ్య కాశీ కార్యక్రమం గురించి దేశంలో కాంగ్రెస్ పార్టీ సహా ఎవరూ విమర్శించలేదని, కానీ కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బండి సంజయ్ పేర్కొన్నారు. "పాపం, ఈయన నిజమైన హిందువు కాబట్టి విమర్శించాడు! అయినా మోదీ ఏం మాట్లాడారు?... నీలాగా చైనాను సమర్థించలేదు, పాకిస్థాన్ ను సమర్థించలేదు, బంగ్లాదేశ్ ను సమర్థించలేదు. ఎక్కడ ఔరంగజేబులు పుట్టుకొస్తే అక్కడ శివాజీలు ఉద్భవిస్తారు అని మోదీ అన్నారు. అదేమైనా తప్పా?" అని ప్రశ్నించారు. మున్ముందు తెలంగాణలో అదే జరుగుతుందని అన్నారు. "నువ్వు ఔరంగజేబులా మారుతున్నావు... తెలంగాణలోనూ శివాజీలు ఉద్భవిస్తారు" అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Bandi Sanjay
CM KCR
Divya Kashi Bhavya Kashi
Modi
Telangana
  • Loading...

More Telugu News